Type Here to Get Search Results !

రాఖీ కట్టిన సోదరీమణులు.. ఆత్మీయంగా స్పందించిన పృథ్వీరాజ్‌ రక్షాబంధన్‌ వేడుకల్లో ఎండీర్‌ ఫౌండేషన్‌ కో-ఫౌండర్‌ మాద్రి పృథ్వీరాజ్‌

 



రక్షాబంధన్‌ వేడుకల్లో ఎండీర్‌ ఫౌండేషన్‌ కో-ఫౌండర్‌ మాద్రి పృథ్వీరాజ్‌

పృథ్వీరాజ్‌కు రాఖీలు కట్టిన పటాన్‌చెరు నియోజకవర్గ సోదరీమణులు

అందోలు, ఆగస్టు 28 (తెలుగు ట్రెండ్స్‌): రాఖీ పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన పలువురు సోదరీమణులు బీఆర్‌ఎస్‌ నాయకుడు, ఎండీర్‌ ఫౌండేషన్‌ కో-ఫౌండర్‌ మాద్రి పృథ్వీరాజ్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు రాఖీలు కట్టి రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మాద్రి పృథ్వీరాజ్‌ సోదరీమణులకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. రక్షాబంధన్‌ సోదర, సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, విశ్వాసం, ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అని పేర్కొన్నారు.

రాఖీ పండుగ ప్రతి కుటుంబంలో సోదరభావాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలందరికీ రక్షాబంధన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

🌐 Select Language