అన్నాచెల్లెళ్ల ఆప్యాయతకు ప్రతీక రక్షాబంధన్
రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపిన మహిళలు
అందోలు, ఆగస్టు 28 (తెలుగు ట్రెండ్స్): అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, బాధ్యతలకు రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తుందని పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు.
రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా చిట్కుల్‌లోని నీలం మధు ముదిరాజ్ నివాసంలో పలువురు మహిళలు ఆయనకు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ వారిని ఆప్యాయంగా పలకరించి, మిఠాయిలు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ సోదర, సోదరీమణుల మధ్య ఉన్న ఆత్మీయ బంధానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ప్రేమ, విశ్వాసం, పరస్పర గౌరవం వంటి విలువలను ఈ పండుగ చాటిచెబుతుందని పేర్కొన్నారు. తెలుగు ట్రెండ్స్ –
అందోలు.

