ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యలు పరిష్కరిస్తా
15వ వార్డులో విస్తృతంగా పర్యటించిన మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్
మెదక్, సెప్టెంబర్ 4 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వార్డులోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తానని మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని 15వ వార్డులో ఆయన విస్తృతంగా పర్యటించి పలు సమస్యలను పరిశీలించారు.
ఈ సందర్భంగా వార్డులో కొనసాగుతున్న తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియను పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా చెత్తను తడి, పొడిగా వేరు చేసి సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు కూడా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు.
అనంతరం వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి విద్యుత్ స్తంభాలకు సంబంధించిన సమస్యలను గుర్తించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న ఆయన, విద్యుత్ శాఖ సిబ్బందితో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
అలాగే వార్డు ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో అవసరమైన నిధులు మంజూరు చేయించుకుని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని దొంతి నరేష్ గౌడ్ స్ప
ష్టం చేశారు.
