అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు హర్షణీయం..!
రామాయంపేటలో పనులను పరిశీలించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం
అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: జిల్లా అధ్యక్షుడు గుండా ఎల్లం
రామాయంపేట, సెప్టెంబర్ 2 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
రామాయంపేట పట్టణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చేపడుతున్న పనులు హర్షణీయమని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మెదక్ జిల్లా అధ్యక్షుడు గుండా ఎల్లం అన్నారు. బుధవారం రామాయంపేటలో కొనసాగుతున్న అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులను ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు.
అనంతరం మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులపై నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా గుండా ఎల్లం మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ద్వారా ఆయన ఆశయాలు, సామాజిక న్యాయం, సమానత్వ సందేశాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే అవకాశం ఏర్పడుతుందని అన్నారు.
రామాయంపేట పట్టణ అభివృద్ధి, సుందరీకరణకు నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు, మున్సిపల్ పాలకవర్గానికి ధన్యవాదాలు తెలిపారు.
మరింత మంది మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి
భవిష్యత్‌లో తెలంగాణ యుద్ధనౌక గద్దర్, వెంకటస్వామి తదితర మహనీయుల విగ్రహాలను కూడా రామాయంపేట పట్టణంలో ఏర్పాటు చేయాలని గుండా ఎల్లం కోరారు. మహనీయుల జీవితాలు, ఆశయాలు, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలను మరింతగా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మాసాయిపేట మల్లేశం, కాంగ్రెస్ నాయకులు బైరం శంకర్, బైరం శీను, గంగారం, భూమకిషన్, కొక్కు బాబు, సత్యం, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.
– తెలుగు ట్రెండ్స్ న్యూస్
