Type Here to Get Search Results !

పాపన్నపేట శ్రీ విద్యా పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.. సర్వేపల్లి రాధాకృష్ణకు ఘన నివాళి

 



పాపన్నపేట శ్రీ విద్యా పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు

పాపన్నపేట, సెప్టెంబర్ 5: మండల కేంద్రమైన పాపన్నపేటలోని శ్రీ విద్యా పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రవీందర్ గుప్తా మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే ఉపాధ్యాయుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు.

అనంతరం పాఠశాల ప్రిన్సిపల్, కరస్పాండెంట్ వికలాక్షప్ప, పి. సుమన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల పీటీలు నిఖిత, కృష్ణ, ఉపాధ్యాయులు జ్యోతి ప్రధాన్, విలాస్, ఆర్గిల్, వసుంధర, ఇందిరా, సుజాత, వనజ, గౌతమి, స్రవంతి, అశ్విని, నిర్మల, సునీత, ప్రియాంక, విజయ, దుర్గ, లావణ్య, షీలా, అనురాధ, పల్లవి, అపూర్వ, స్నేహ, కల్పన తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ట్రెండ్స్ | పాపన్నపేట

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

🌐 Select Language