పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..!
కూచారంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తున్నాం: సర్పంచ్ రాజనాల చిత్ర రఘు
తూప్రాన్/మనోహరాబాద్, ఆగస్టు 31 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
పేద ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని కూచారం సర్పంచ్ రాజనాల చిత్ర రఘు అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించే దిశగా చర్యలు చేపడుతోందని తెలిపారు.
సోమవారం కూచారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వం అందజేసిన స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందించడంతో పాటు రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
పేద, అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. పేద కుటుంబాలకు అండగా నిలవడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా స్థానికంగా కూడా సహకరిస్తామని తెలిపారు.
పేదల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని సర్పంచ్ రాజనాల చిత్ర రఘు కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నాయిని లక్ష్మీ నరసింహులు గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
– తెలుగు ట్రెండ్స్ న్యూస్


