Type Here to Get Search Results !

22/AG జీవోపై బీజేపీ సమరభేరి..! సిద్దిపేటకు చేరుకున్న రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మహాధర్నాకు తరలివచ్చిన బీజేపీ శ్రేణులు.. జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్

 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఘన స్వాగతం


సిద్దిపేటలో మహాధర్నాకు హాజరైన ఎన్‌. రాంచందర్‌రావు


22/AG జీవోను వెంటనే రద్దు చేయాలని బీజేపీ డిమాండ్‌


సిద్దిపేట, ఆగస్టు 31 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):

22/AG జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దిపేటకు విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌. రాంచందర్‌రావుకు జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.


రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు 22/AG జీవోపై తమ నిరసనను వ్యక్తం చేస్తూ, రైతులు, ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.


ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి నత్తి మల్లేష్‌ ముదిరాజ్‌, మనోహరాబాద్‌ మండల అధ్యక్షులు బక్క వెంకటేష్‌ గౌడ్‌, తూప్రాన్‌ రూరల్‌ అధ్యక్షులు పిట్ల పోచయ్య, 2వ వార్డు కౌన్సిలర్‌ చందా అశోక్‌, శ్రీనివాస్‌రెడ్డి, పరుమ్‌ నరేష్‌ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. 22/AG జీవో రైతులకు, ప్రజలకు తీవ్ర అన్యాయం చేసేలా ఉందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవోను రద్దు చేసి రైతుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్‌ చేశారు.


రైతు, ప్రజా సమస్యలపై బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు. 22/AG జీవో రద్దయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు.


సిద్దిపేటలో నిర్వహించిన మహాధర్నా ద్వారా ప్రభుత్వానికి ప్రజల, రైతుల సమస్యలను స్పష్టంగా తెలియజేస్తామని, 22/AG జీవో విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని నాయకులు వెల్లడించారు.


– తెలు


గు ట్రెండ్స్ న్యూస్

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

🌐 Select Language