Type Here to Get Search Results !

ఏడుపాయల అమ్మవారి సన్నిధిలో బీఆర్‌ఎస్‌ ప్రత్యేక పూజలు..! సునీతా లక్ష్మారెడ్డి పాదయాత్ర విజయవంతం కావాలని ప్రార్థనలు వెల్దుర్తి–పిల్లికొట్టాల పాదయాత్రకు మద్దతుగా కొల్చారం బీఆర్‌ఎస్‌ నేతల పూజలు

 


పాదయాత్ర విజయవంతం కావాలని ఏడుపాయలలో ప్రత్యేక పూజలు

సునీతా లక్ష్మారెడ్డి పాదయాత్రకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ నేతల పూజలు

కొల్చారం, ఆగస్టు 31 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
నర్సాపూర్‌ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి చేపడుతున్న పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ కొల్చారం మండల బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వెల్దుర్తి నుంచి పిల్లికొట్టాల వరకు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చేపడుతున్న పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని, ప్రజల ఆశీస్సులు ఆమెకు లభించాలని కోరుతూ సోమవారం ఏడుపాయల ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు పార్థివ్‌ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అమ్మవారి దర్శనం చేపట్టారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే చేపడుతున్న పాదయాత్ర విజయవంతం కావాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కొల్చారం మండలం బీఆర్‌ఎస్‌ పార్టీ యువత అధ్యక్షుడు సంతోష్‌రావు, కొల్చారం మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రవితేజరెడ్డి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు శ్యామ్‌, తుక్కాపూర్‌ సర్పంచ్‌ ఆంజనేయులు, అంసానిపల్లి సర్పంచ్‌ రమేష్‌ గీత, తుక్కాపూర్‌ ఉపసర్పంచ్‌ ఆరే రవీందర్‌, మాజీ సర్పంచ్‌ గడ్డమీది నర్సింలు, కొమ్ముల యాదగౌడ్‌, చిన్నఘనపూర్‌ పీఎస్‌సీఎస్‌ వైస్‌ చైర్మన్‌ రాజుగౌడ్‌, ధనరాజ్‌, గౌరీశంకర్‌, మాజీ ఎంపీటీసీ సిద్ధ రాములు, సురేష్‌గౌడ్‌, శ్రీకాంత్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

– తెలుగు ట్రెండ్స్ న్యూస్
కొల్చారం రిపోర్టర్‌: ముత్తయ్య

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

🌐 Select Language