Type Here to Get Search Results !

నేడు కరెంట్‌ కట్‌.. 5 గంటలు! కొత్త ఫీడర్‌ పనులతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 వరకు పలు గ్రామాల్లో సరఫరా నిలిపివేత

 


నేడు 5 గంటల పాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం..!

కొత్త ఫీడర్‌ పనుల నేపథ్యంలో సరఫరా నిలిపివేత

మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పలు గ్రామాల్లో కరెంట్‌ కట్‌

తూప్రాన్/మనోహరాబాద్, సెప్టెంబర్‌ 1 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్‌ ఫీడర్‌ పనుల కారణంగా మంగళవారం తూప్రాన్‌ పరిధిలోని పలు గ్రామాలకు సుమారు ఐదు గంటల పాటు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని తూప్రాన్‌ విద్యుత్‌ శాఖ ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు.

చేగుంట 132 కేవీ నుంచి 33 కేవీ నూతన ఫీడర్‌ ఏర్పాటు పనులు కొనసాగుతున్నందున మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ పనుల కారణంగా ఇస్లాంపూర్‌, మల్కాపూర్‌, వెంకటాయపల్లి సబ్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోనుందని ఏఈ తెలిపారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయే సమయంలో గృహ, వాణిజ్య వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

నూతన ఫీడర్‌ పనులు పూర్తయిన అనంతరం విద్యుత్‌ సరఫరా వ్యవస్థ మరింత మెరుగుపడే అవకాశం ఉందని విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. పనులు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

విద్యుత్‌ అంతరాయం కారణంగా వినియోగదారులు ఇబ్బందులు పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, విద్యుత్‌ శాఖ సిబ్బందికి సహకరించాలని ఏఈ వెంకటేశ్వర్లు కోరారు.

– తెలుగు ట్రెండ్స్ న్యూస్

తూప్రాన్ రిపోర్టర్‌: R. చంద్రశేఖర్

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

🌐 Select Language