*5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్, బ్యాడ్మింటన్లో జిల్లాకు బంగారు పతకం*
-బంగారు పతకం సాధించిన హెడ్ కానిస్టేబుల్ ఈ.డి. సంజీవ్
-అభినందించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
*తెలుగు ట్రెండ్స్, అందోలు:*
తెలంగాణ పోలీస్ అకాడమీ, హైదరాబాద్లో జరిగిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఈ.డి. సంజీవ్ బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ (ఐపీఎస్) బంగారు పతకం సాధించిన హెడ్ కానిస్టేబుల్ సంజీవ్ను అభినందించారు. క్రీడల్లో ప్రతిభ కనబరచడం ద్వారా సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖకు గౌరవం తీసుకురావడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ ప్రతిభను కనబరుస్తూ, జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సంజీవ్ను ప్రోత్సహిం
చారు.
