Type Here to Get Search Results !

ఓటర్లకు నోటీసులు.. విచారణ షురూ..! 6,798 మంది ఓటర్లకు నోటీసులు.. సెప్టెంబర్‌ 17 వరకు శిబిరాలు

 


నోటీసులు అందుకున్న ఓటర్లకు విచారణ షురూ..!

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు

6,798 మంది ఓటర్లకు నోటీసులు.. సెప్టెంబర్‌ 17 వరకు కొనసాగనున్న పరిశీలన

వెల్దుర్తి, సెప్టెంబర్‌ 2 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్ల వివరాల పరిశీలనకు అధికారులు శ్రీకారం చుట్టారు. నోటీసులు అందుకున్న ప్రతి ఓటరుకు సంబంధించిన వివరాలు, ఆధార పత్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఆయా గ్రామాల్లో ప్రత్యేక విచారణ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియను అధికారులు పకడ్బందీగా కొనసాగిస్తున్నారు.

బుధవారం చర్లపల్లి, ఆరేగూడెం, ఎల్కాపల్లి, షేరిల గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్‌ నోటీసుల విచారణ శిబిరాలను వెల్దుర్తి తహసీల్దార్‌ విజయలక్ష్మి సందర్శించారు. ఈ సందర్భంగా నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి అధికారులు స్వీకరిస్తున్న వివరాలు, ఆధార పత్రాలను పరిశీలించారు. విచారణ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందో పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

6,798 మంది ఓటర్లకు నోటీసులు

ఈ సందర్భంగా తహసీల్దార్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ.. వెల్దుర్తి మండల పరిధిలో మొత్తం 22,562 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరిలో 6,798 మంది ఓటర్లకు ఎస్‌ఐఆర్‌ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు ముందస్తుగా సమాచారం అందించి, ఆయా గ్రామాల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.

నోటీసులు అందుకున్న ఓటర్లు తమకు కేటాయించిన శిబిరాలకు హాజరై వివరాలను, అవసరమైన ఆధార పత్రాలను సమర్పించాలని సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని కోరారు.

సెప్టెంబర్‌ 17 వరకు శిబిరాలు

ఎస్‌ఐఆర్‌ నోటీసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలు సెప్టెంబర్‌ 17 వరకు కొనసాగుతాయని తహసీల్దార్‌ విజయలక్ష్మి తెలిపారు. నోటీసులు అందుకున్న వారు నిర్ణీత సమయంలో శిబిరాలకు హాజరై తమ వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు.

ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత అధికారులు, బీఎల్‌ఓలను సంప్రదించి అవసరమైన సమాచారం పొందాలని తెలిపారు. ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు సక్రమంగా ఉండేలా ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ నర్సింగ్‌ యాదవ్‌, ఆరేగూడెం, చర్లపల్లి, ఎల్కాపల్లి, షేరిల గ్రామాల సర్పంచులు, బీఎల్‌ఓలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

– తెలుగు ట్రెండ్స్ న్యూస్
వెల్దుర్తి రిపోర్టర్‌: నర్సింహా గౌడ్

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

🌐 Select Language