22ఏ నుంచి రైతుల భూములను తొలగించాలి..!
మహాధర్నాలో బీజేపీ నేతల డిమాండ్
రైతుల భూములు 22ఏలో చేరడంతో తీవ్ర ఇబ్బందులు: ఎంపీ రఘునందన్‌రావు
మెదక్, పాపన్నపేట
, సెప్టెంబర్ 2 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
రాష్ట్ర ప్రభుత్వం 22ఏ జాబితాలో చేర్చిన రైతుల భూములను తక్షణమే తొలగించాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. బుధవారం నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్‌గౌడ్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసిన పొరపాట్ల కారణంగా రైతుల భూములు 22ఏ జాబితాలో చేరాయని ఆరోపించారు. దీంతో భూముల క్రయవిక్రయాలు, ఇతర అవసరాల విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
రైతులకు సంబంధించిన భూములను 22ఏ నుంచి తక్షణమే తొలగించి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కోరారు.
పాపన్నపేట నుంచి బీజేపీ శ్రేణుల తరలింపు
మహాధర్నాకు పాపన్నపేట మండలం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ ముదిరాజు ఆధ్వర్యంలో సుమారు 60 మంది నాయకులు, కార్యకర్తలు నర్సాపూర్ మహాధర్నాలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు బీకొండ రాములు నేత, జిల్లా కార్యవర్గ సభ్యుడు చంద్రన్న, మండల అధ్యక్షుడు సిద్ధిరాములు, నార్సింగ్ ఉపసర్పంచ్ శ్రీరామ్ నరేష్, సీనియర్ నాయకులు దుర్గయ్య, డా. రాజేందర్, బుల్లెట్ యేసు, మాజీ జనరల్ సెక్రెటరీ దుర్గాప్రసాద్, శంకర్‌గౌడ్, నామాపూర్ వార్డు మెంబర్ కుమార్, పాపన్నపేటకు చెందిన సుంకరి కిష్టయ్య, కనకంటి విట్టల్, గోపాల్, రామచందర్, వెంకట్, మల్లేశం, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
– తెలుగు ట్రెండ్స్ న్యూస్
పాపన్నపేట
