Type Here to Get Search Results !

పాలాటలో ఘనంగా గాంధీ విగ్రహావిష్కరణ.. అహింస, సత్యం, శాంతి మార్గాలే ఆదర్శం

 పాలాటలో గాంధీ విగ్రహం ఆవిష్కరణ


అహింస, సత్యం, శాంతి మార్గాలు నేటి సమాజానికి ఆదర్శం: మనోహరాబాద్ ఎస్‌ఐ సుభాష్ గౌడ్

మనోహరాబాద్, అక్టోబర్‌ 2 (తెలుగు ట్రెండ్స్): మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మనోహరాబాద్ మండలం పాలాట గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ సాయికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహాన్ని మనోహరాబాద్ ఎస్‌ఐ సుభాష్ గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు, యువకులు పాల్గొని మహాత్మా గాంధీ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సుభాష్ గౌడ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమైన మహనీయుడని అన్నారు. సత్యం, అహింస, శాంతి సిద్ధాంతాలతో గాంధీజీ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. మహనీయుల ఆశయాలను స్మరించుకోవడంతో పాటు వారి సందేశాలను నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గాంధీజీ చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అనంతరం సర్పంచ్ సాయికుమార్ మాట్లాడుతూ పాలాట గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహ పునర్నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. గాంధీజీ చూపిన అహింస, సత్యం, శాంతి మార్గాలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ సమాజ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని, గ్రామంలో ప్రజల మధ్య సోదరభావం, ఐక్యత కొనసాగాలని అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గ్రామంలో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆయన సేవలను, ఆశయాలను నిరంతరం స్మరించుకునే అవకాశం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రావణి మహేష్, మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, నాయకులు పూల అర్జున్, మల్లేష్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువకులు, వివిధ వర్గాల నాయకులు పాల్గొని మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించా


రు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language