దేవులపల్లిలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ
లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు అందజేసిన గ్రామ ప్రజాప్రతినిధులు
కౌడిపల్లి, అక్టోబర్ 2 (తెలుగు ట్రెండ్స్): కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు రేషన్ స్మార్ట్ కార్డులను గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు అందజేశారు. రేషన్ స్మార్ట్ కార్డుల ద్వారా ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ కింద లబ్ధిదారులకు అందుతున్న సేవలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవులపల్లి సర్పంచ్ అన్నవరం తిరుపతిరెడ్డి, ఉపసర్పంచ్ శ్రీకాంత్, పార్టీ సీనియర్ నాయకులు చందూరి ప్రకాశ్, వార్డు సభ్యులు కె. రాజు, క్రాంతికుమార్తో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేసిన అనంతరం గ్రామంలో ప్రజలకు సంబంధించిన పలు అంశాలపై ప్రజాప్రతినిధులు, నాయకులు చర్చించారు. గ్రామంలో ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలు, స్థానికంగా ఉన్న సమస్యలపై పరస్పరం చర్చించి అవసరమైన చర్యలపై మాట్లాడారు. రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీతో అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ రేషన్ సరుకులు పొందడంలో మరింత సౌలభ్యం కలుగుతుందని గ్రామ ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమంలో లబ్ధిదారులు, గ్రామస్థులు పాల్గొన్నా
రు.
