బాపూజీ చూపిన శాంతి మార్గంలో పయనిద్దాం
గాంధీజీ ఆశయాల సాధనకు కృషి చేద్దాం: మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ సత్యనారాయణ
అందోలు, అక్టోబర్ 2 (తెలుగు ట్రెండ్స్): మహాత్మా గాంధీ చూపిన శాంతి, సహనం, సత్యమార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని అందోలు-జోగిపేట మున్సిపల్ చైర్మన్ ఎస్. కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం జోగిపేట క్లాక్ టవర్, గాంధీ పార్కులోని మ
హాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తుచేశారు. మహాత్మా గాంధీ కలలుగన్న సమానత్వం, గ్రామ స్వరాజ్యం, స్వావలంబన, స్వచ్ఛత వంటి ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సమాజంలో శాంతి, సహనం, సత్యం, అహింస వంటి విలువలను పాటిస్తూ గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. గాంధీజీ జీవిత సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్లు కోషికే రాజశేఖర్, పట్లోళ్ల శ్రీనివాస్, బేగరి శశిరేఖ అనిల్ కుమార్, పట్లోళ్ల రేఖ ప్రవీణ్ కుమార్, నేనావత్ మేఘరాణి సైలాన్, జ్యోతి ప్రదీప్ గౌడ్, కో-ఆప్షన్ సభ్యుడు జీషన్, చేనేత సహకార సంఘం చైర్మన్ పడిగే సత్యం, మాజీ కౌన్సిలర్ పిట్ల లక్ష్మణ్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

